సీపీ నార్కో టెస్ట్‌కు సిద్ధమా?
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): సీనియర్ న్యాయవాది, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డిపై పోలీసులు అక్రమ కేసు బనాయించారని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ఆరోపించింది. ఈ కేసులో వాస్తవాలపై నగర పోలీసు కమిషనర్ నార్కో టెస్ట్‌కు సిద్ధమా అంటూ సవాల్ విసిరింది. సీనియర్ న్యాయవాది గౌతంరెడ్డి ఇంట్లోకి అర్ధరాత్రి అక్రమంగా ప్రవేశించడాన్ని తప్పుబట్టింది. ఆయన లేని సమయంలో పోలీసులు గోడలు దూకి వెళ్లాల్సిన అవసరమేమొచ్చిందని, ఆయన ఇంట్లో మావోలు ఉన్నారా అని నిలదీసింది. గురువారం సత్యనారాయణపురం భగత్ సింగ్‌రోడ్డులోని గౌతమ్ రెడ్డి కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. లీగల్ సెల్ జోనల్ ఇన్‌చార్జి ఒగ్గు గవాస్కర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీలో చురుకుగా ఉన్న ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులపై అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీసిందన్నారు. సీనియర్ న్యాయవాది గౌతమ్‌రెడ్డిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేస్తే వాస్తవాలు పరిశీలించకుండా అక్రమంగా కేసులు బనాయించారన్నారు. ఈ ఫిర్యాదులో ఉన్న విషయాలు వాస్తవమైతే కమిషనర్‌గానీ, ఫిర్యాదు దారుగానీ నార్కో టెస్ట్‌కు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
తప్పుడు కేసులే!
కమిషనరేట్‌లో టార్గెట్‌లు నిర్దేశించి ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు, సీఎం, డిప్యూటీసీఎం, హోం మంత్రులపై పోస్టుల అంశంలో సైబర్ క్రైం పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, యాక్టివిస్టులను వేధిస్తున్నారని మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న అధికారుల భరతం పడతామన్నారు. హైకోర్టు న్యాయవాది కోటంరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలీసు అధికారులపై లీగల్ సెల్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. మరో న్యాయవాది సాయిరాం మాట్లాడుతూ ఫిర్యాదుదారు ఇచ్చిన ఫిర్యాదుల్లో వాస్తవం లేదన్నారు. గౌతమ్‌రెడ్డి చట్టబద్ధంగానే స్థలం కొనుగోలు చేశారని, కోర్టుల్లోనూ ఆయనకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని చెప్పారు. అన్ని అనుమతులతోనే భవ నం నిర్మిస్తున్నారన్నారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో విచారణ చేయాలని.. పాలకుల కోసమే ఇవన్నీ చేస్తే కచ్చితంగా ప్రైవేటు కేసులు వేసి కోర్టుకీడుస్తామని హెచ్చరించారు. కేసుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించకపోతే పోలీసులు కేసులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో న్యాయవాది బసవారెడ్డి పాల్గొన్నారు.
గౌతమ్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులో పోలీసుల తీరుపై వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఆగ్రహం
సీనియర్ న్యాయవాది ఇంట్లోకి అర్ధరాత్రి అక్రమంగా ప్రవేశిస్తారా?
పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తాం .. కోర్టుకీడుస్తాం
Comments
Please login to add a commentAdd a comment