ముగిసిన చెస్ టోర్నమెంట్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ క్రీడా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (కాకినాడ) సెంట్రల్ జోన్ చెస్ (మెన్ అండ్ ఉమెన్) అంతర్ కళాశాలల చెస్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. అనంతరం విశ్వవిద్యాలయం టీమ్‌లను ఎంపిక చేశారు. ముఖ్యఅతిథిగా క్రీడా విభాగ కార్యదర్శి డాక్టర్ జీపీ రాజు ప్రసంగించారు. కళాశాల కార్యదర్శి చిట్టా అమర్‌సుధీర్, కోశాధికారి రాఘవయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ శరవణకుమార్, క్రీడా విభాగాధిపతి విక్టర్‌జాన్సన్ పాల్గొన్నారు.
టోర్నమెంట్ విజేతలు
మెన్స్ విభాగంలో సర్ సీఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రథమ స్థానంలోనూ, వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ద్వితీయ స్థానంలోనూ, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ తృతీయ స్థానంలో నిలిచాయి. ఉమెన్స్ విభాగంలో ప్రథమ స్థానంలో పీవీపీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ద్వితీయ స్థానంలో ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీ, తృతీయ స్థానంలో పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ విద్యార్థులు గెలుపొందారు.
విశ్వవిద్యాలయం చెస్ టీమ్
జేఎన్‌టీయూ కాకినాడ చెస్ టీమ్ సెలక్షన్స్ జరిగాయి. బాలుర విభాగంలో కె.శశాంక్ (కె.హెచ్.ఐ.టి, చోడవరం), కె.గుణశేఖర్ (పీఎస్‌సీఎంఆర్ కాలేజ్ విజయ వాడ), ఎ.నిఖిల్‌దత్ (జేఎన్టీయూకే, నరసరావుపేట) వై.రమశ్రీకర్ (సీఆర్‌రెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్), కె. గౌతమ్‌ధర్మ (ఎస్‌ఐఈటి, అమలాపురం) బీజేఎస్‌కే రణధీర్ (ఎన్‌ఆర్‌ఐటి, ఆగిరిపల్లి) స్టాండ్‌బైలో కె.త్రిదేవ్‌రెడ్డి (పీఎస్‌సీఎంఆర్), విశ్వనాథ్ (పీఎస్‌సీఎంఆర్) అర్హత సాధించారు. చెస్ ఉమెన్స్ విభాగంలో బి.నిహారిక (పీవీపీ ఎస్‌ఐటీ, కానూరు) ఎల్.శ్వేత శ్రీ (పీవీపీఎస్‌ఐటీ) షేక్ సమీరా (పీఎస్‌సీఎంఆర్) కేఎంఎస్‌ఎల్ సింధూర (పీవీపీఎస్‌ఐటీ ) జి.హర్షితదేవి (ఎస్‌ఆర్‌జీఈసీ గుడ్లవల్లేరు), జి.విజయలక్ష్మి (ఎస్‌ఆర్‌కేఆర్, భీమవరం)లు అర్హత సాధించారు. స్టాండ్‌బైలో ఎ.ఝాన్సీ (ఎస్‌ఆర్‌కేఆర్ భీమవరం), సీహెచ్ శ్రీకృష్ణకీర్తి (పీఎస్‌సీఎంఆర్ )లు ఎంపికయ్యారు. ఎంపికై న బృందాలు డిసెంబర్ నాలుగు నుంచి ఏడు వరకు చైన్నె వెల్‌టెక్ యూనివర్సిటీలో జరిగే సౌత్‌జోన్ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment