సమన్వయంతో అర్జీలను పరిష్కరించండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) ద్వారా అందిన అర్జీలను సమన్వయంతో సత్వరం పరిష్కరించా లని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం సోమవారం జరిగింది. జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధిమీనా, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జీఎస్‌డబ్ల్యూఎస్ ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీఆర్ డీఏ పీడీ కె.శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్ ద్వారా ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎస్‌వోపీ ప్రకారం నాణ్యతతో పరిష్కరించాలని, ఇందుకు జిల్లాస్థాయి అధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
రెవెన్యూ శాఖ అర్జీలే అధికం
పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో మొత్తం 120 అర్జీలు వచ్చాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వీటిలో రెవెన్యూకు సంబంధించి 52 అర్జీలు అందాయన్నారు. పంచాయతీరాజ్ 13, పోలీస్ 8, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 4, విద్య 4, పౌర సరఫరాలు 3, విభిన్న ప్రతిభావంతులు 2, ఉపాధి కల్పన 2, హౌసింగ్ 2, హెల్త్ 2, దేవదాయ శాఖ, మైన్స్ అండ్ జియాలజీ, మత్స్య శాఖ, నేషనల్ హైవే, స్కిల్ డెవలప్మెంట్, అటవీ, డీఆర్డీఏ, వ్యవసాయ శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ అందాయన్నారు. వాటిని నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
పరిహారం అందించాలి
‘బుడమేరు వరద నగరాన్ని ముంచెత్తి వంద రోజులైంది. ప్రజలు వరదల్లో సర్వం కోల్పోయారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని చెప్పింది. ఇప్పటికీ బాధితులకు పరిహారం అందలేదు. గుర్తించిన బాధితులందరికీ పరిహారం అందజేయాలి’ అని కోరుతూ సీపీఎం నాయకులు సీహెచ్‌బాబూరావు, కాశీనాథ్ బాధితుల తరఫున కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
అధికారులకు కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ఆదేశం ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థకు 120 అర్జీలు
గుడిని రక్షించాలని వినతి
‘విజయవాడ బాడవాపేట రెల్లి వీధిలో 40 ఏళ్ల కిందట నూకాలమ్మ దేవస్థానాన్ని నిర్మించారు. అప్పటి నుంచి రెల్లి కులస్తులు ఆరాధిస్తున్నారు. ఇటీవల కొందరు దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. విగ్రహాలను దొంగిలించారు. దేవాలయాన్ని కాపాడాలని అడిగిన మాపైనే మాచవరం పోలీసులు వత్తిడి చేస్తున్నారు. ఆలయాన్ని రక్షించండి’ అని కోరుతూ రెల్లి వీధికి చెందిన పెద్దలు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment