డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు)/మైలవరం: విజయవాడ నగరంలోని గిరిపురం, లబ్బీపేట పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు, జిల్లా మలేరియా కార్యాలయం, మైలవరం మండలం చంద్రాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లోని మైలవరం–5 హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌ను గురువారం ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఉద్యోగుల హాజరు, ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందులు, నిర్వహిస్తున్న లేబొరేటరీ పరీక్షల వివరాలను తెలుసుకున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహి స్తున్న వివిధ రిజిస్టర్‌లను తనిఖీచేశారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలాజీ, డాక్టర్ కార్తీక్, మైలవరం కో లొకేటెడ్ వైద్యాధికారి డాక్టర్ అరుణ, సీహెచ్‌ఓలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
కృష్ణావర్సిటీ ఖోఖో
జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల ఖోఖో మహిళల పోటీలకు ప్రాతినిధ్యం వహించే కృష్ణా యూనివర్సిటీ జట్టును ఎంపిక చేసినట్లు శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కాలేజీ వ్యాయామ అధ్యాపకురాలు డాక్టర్ ఎన్.హేమ తెలిపారు. ఇటీవల కాలేజీలో నిర్వహించిన పోటీల్లో క్రీడానైపుణ్యం ప్రదర్శించిన దుర్గాభవాని, చైతన్య, అనూష, బాలదుర్గ, ఇందుమతి, సోజాశ్రీ, రాజేశ్వరినాగ దుర్గ, రమ్యరెడ్డి, రమేజున్సీసా, జ్యోతి, సంధ్య, దివ్యశ్రీ, మోనిక, అఖిల, నేహా జట్టుకు ఎంపికై నట్లు వెల్లడించారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు కేరళలోని కాలికట్ యూనివర్సిటీలో జరిగే పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని పేర్కొన్నారు. జట్టును కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కల్పన, కన్వీనర్ శ్రీలలిత్ ప్రసాద్, ప్రత్యేక అధికారి డాక్టర్ ఆర్.మాధవి, కోచ్ భాస్కరరావు గురువారం అభినందించారు.
ధాన్యం కొనుగోళ్లలో
అప్రమత్తంగా ఉండాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతు సేవా కేంద్రాల పరిధిలో ఇప్పటి వరకు రూ.178.39 కోట్ల విలువైన 77,440 టన్నుల ధాన్యాన్ని 11,730 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. చివరి గింజ కొనుగోలు చేసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ ధాన్యం కొనుగోళ్లపై రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయం, మార్కెటింగ్, సహకార తదితర శాఖల అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు సేక రించిన ధాన్యం, రైతుల ఖాతాల్లో జమచేసిన సొమ్ము, గోనె సంచుల అందుబాటు, మిల్లులకు ధాన్యం రవాణా, వర్షాల నేపథ్యంలో తీసుకున్న ప్రత్యేక చర్యలు తదితరాలపై చర్చించారు. వరి కోతలు చివరి దశలో ఉన్నందున ఆయా రైతులతో క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అవసరమైన సహాయ సహకారాలు అందించాల న్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిధి మీనా, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ఎం.శ్రీనివాసు, డీఎస్‌ఓ ఎ.పాపారావు, జిల్లా వ్యవసాయ టెక్ని కల్ అధికారి ఎం.స్వప్న, జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎస్.శ్రీనివాసరెడ్డి, మార్కెటింగ్ ఏడీ కె.మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 574.40 అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 7,578 క్యూసెక్కులు విడుదలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment