ఆటోనగర్(విజయవాడతూర్పు): వార్షిక తనిఖీలో భాగంగా గురువారం విజయవాడ ఆటోనగర్‌లోని అగ్నిమాపక కేంద్రాన్ని ఏపీ అగ్నిమాపకశాఖ అడిష నల్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక కేంద్రాలకు సిబ్బంది కొరతను తీర్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికి తగ్గట్టు 100 వాహనాలను కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. త్వరలో విజయవా డలో కమాండ్ సెంటరు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 185 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయని, మరో 17 కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. అగ్నిమాపకశాఖ ఆధునీకర ణలో భాగంగా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.252 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. జిల్లా అగ్నిమాపక కేంద్రం జిల్లా అధికారి ఎ.వి.శంకరరావు, ఆటోనగర్ అగ్నిమాపక కేంద్రం అధికారి కె.నరేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment