వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారి వేక్షిత
పెనమలూరు: మండల కేంద్రమైన పెనమలూరుకు చెందిన చిన్నారి కిలారు వేక్షితశివ పెయింటింగ్‌లో ప్రతిభ చాటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాఽధించింది. వేక్షిత తాడిగడపలో శివ ఆర్ట్స్ అకాడమీలో విద్యార్థినిగా పెయింటింగ్‌లో శిక్షణ పొందింది. ఆమె నవంబర్ 19వ తేదీన మూడు గంటల 29 నిమిషాల 48 సెకన్లలో 81 ప్రమిదలపై దేవుళ్లు, మనుషులు, కూరగాయలు, పండ్ల పెయింటింగులు వేసింది. తొలుత 50 ప్రమిదల పైనే పెయింటింగ్ వేస్తుందని భావించగా చిన్నారి 81 ప్రమిదలపైవేసి సత్తా చాటింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంస్థ వేక్షిత ప్రమిదలపై వేసిన పెయింటింగ్‌కు వరల్డ్ రికార్డుగా ప్రకటించి సర్టిఫికెట్ పంపారు. శివ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకుడు పామర్తి శివ, వేక్షిత తల్లిదండ్రులు దివ్యశ్రీ, త్రినాథ్ ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment