కూచిపూడి(మొవ్వ): ప్రసిద్ధ నాట్య క్షేత్రమైన కూచిపూడిలో ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగే కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు రష్యా, కెనడా, అమెరికా, జపాన్, జర్మనీ తదితర దేశాల నుంచి కళాకారులు తరలివచ్చి తమ నృత్య ప్రదర్శనలతో సిద్ధేంద్రుడికి నీరాజనాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కేంద్ర సాంస్కృతిక శాఖ, రాష్ట్రానికి చెందిన క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభిస్తారని తెలిపారు. ఉత్సవ కమిటీ కన్వీనర్ డాక్టర్ వేదాంతం వెంకట నాగచలపతి (వెంకు), కమిటీ సభ్యుల పర్య వేక్షణలో శుక్రవారం ఉదయం ఆరు గంటలకు నగర సంకీర్తన, ఏడు గంటలకు నాట్యశిక్షణ శిబిరం, తొమ్మిది గంటలకు 50 అడుగుల పతాక స్థూపం ఆవిష్కరణ, 9.30 గంటల నుంచి సదస్సులు, రాత్రి 11 గంటల వరకు నృత్య ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. 28న నగర సంకీర్తన, నాట్య శిక్షణ శిబిరం, సెమినార్ పుస్తకావిష్కరణ, అతిథుల ఉప న్యాసాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, 29న సాయంత్రం రెండు వేల మంది కళాకారులతో మహా బృందనాట్యం ఇతర ప్రదర్శనలు ఉంటాయని తెలి పారు. మూడు రోజులపాటు నిర్వహించే స్వర్ణోత్స వాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూచి పూడికి గుర్తింపుతో ప్రతి ఒక్కరూ గర్వపడేలా విజయవంతం చేయాలని అధికారులను కోరారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment