నష్టం అపారం.. అరకొర సాయం
2.68 లక్షల కుటుంబాలను బుడమేరు ముంచింది. బాధితులను గుర్తించేందుకు 1,700 బృందాలతో ప్రభుత్వం సర్వే చేయించింది. అప్పట్లో అధికారులు ప్రకటించిన లెక్కల ప్రకారం 98,662 ఇళ్లు, 5,975 ఎంఎస్‌ఎంఈలు (చిన్నతరహా పరిశ్రమలు), 41,814 వాహనాలు నిటమునిగాయి. 39,470 మంది సాధారణ రైతులను, 2,448 మంది ఉద్యాన రైతులు, 479 మత్య్సకారులను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఇప్పటికీ పలువురు బాధితులు ఇళ్లు, వాహనాలు, వ్యవసాయ, ఉద్యాన, ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి పరి హారం అందలేదని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో టీడీపీ ప్రజాప్రతినిధులే ప్రస్తావించారు. మొత్తంగా ప్రజలు రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టపోయా రని అధికారుల అంచనా. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.304.08 కోట్లను మాత్రమే పరిహారంగా ఇచ్చి చేతులు దులుపుకొందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment