చిలకలపూడి(మచిలీపట్నం): వైద్య, ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా పోస్టుల భర్తీ కోసం అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జి.గీతాబాయి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్‌టెక్నీషియన్ గ్రేడ్–2 నాలుగు పోస్టులు, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎనిమిది పోస్టులు, శానిటరీ అటెండర్ కం వాచ్‌మన్ పది పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారం వెబ్‌సైట్‌లో ఉందని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను మచిలీపట్నంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఈ నెల 16వ తేదీలోగా అందజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment