పెనమలూరు: మండలంలోని పోరంకిలో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజీలో నీట్ లాంగ్‌టర్ము చదువుతున్న జనావత్ పరుశురామ్‌నాయక్ (19) చదువు ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి జణావత్ శంకర్‌నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోరంకిలో సోమవారం కార్పొరేట్ కాలేజీలో నీట్ విద్యార్థి హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి పోలీసులకు చేసిన ఫిర్యాదు చేశారు. తన కుమారుడు చదువు ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అందులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment