పెనమలూరులో పేదల ఇళ్లు నేలమట్టం
పెనమలూరు: మండల కేంద్రమైన పెనమలూరులో పేదల ఇళ్లను అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. పెనమలూరు – చోడవరం రహదారి పక్కన ఆక్రమణల్లో ఉన్న దాదాపు 100 ఇళ్లను సోమవారం 10 జేసీబీలతో కూల్చివేత కార్యక్రమం చేపట్టి మంగళవారంతో ముగించారు. అనేక పేద కుటుంబాలు పెనమలూరు రోడ్డులో హైస్కూల్ సెంటర్ నుంచి అంబేడ్కర్ నగర్ వరకు దాదాపు 40 సంవత్సరాలుగా ఇళ్లు ఏర్పాటు చేసుకోని జీవిస్తున్నాయి. రహదారి విస్తరణ పేరుతో కూటమి నేతలు పేదల ఇళ్లపై కన్నేశారు. దీంతో భారీ జేసీబీలను రంగంలోకి దించారు. నివాసితులు నిద్రలో ఉండగా సోమవారం ఒక్కసారిగా పేదల ఇళ్లపై విరుచుకు పడ్డారు. పేదలకు ఏమాత్రం గడువు ఇవ్వకుండా ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారు. రెండో రోజుల కూడా కూల్చి వేత పనులను పోలీసుల బందో బస్తుతో కొనసాగించారు. ఇళ్లు కూల్చివేసిన తరువాత ఆ ప్రాంతం బీభత్సంగా మారింది. భూకంప పరిస్థితులు తలపిస్తోం. ఇళ్లు కూల్చి వేయటంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
హైస్కూల్ వరకూ విస్తరిస్తారా..
పెనమలూరు వంతెన వద్ద నుంచి హై స్కూల్ వరకు ఉన్న రోడ్డు కూడా విస్తరిస్తారా లేదా అనే విషయం గ్రామంలో చర్చనీయంగా మారింది.
ఈ ప్రాంతంలో పెద్దల భవనాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా ఉండ టంతో తరుచుగా ట్రాఫిక్ జామ్ అవు తోంది. మరి ఈ పరిస్థితిలో ఇక్కడ కూడా పారదర్శకంగా రహదారి విస్తరిస్తారా లేదా అనే విషయం గ్రామంలో చర్చనీయంగా మారింది.
కోర్టుకు వెళ్లిన బాఽధితులు
ఇళ్ల కూల్చివేతపై పలువురు బాఽధితులు కోర్టుకు వెళ్లారు. తమకు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఇళ్లు కూల్చి వేశారని కోర్టును ఆశ్రయించారు. పలు దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు రోడ్డు ఆక్రమణల్లోనే ఉన్నాయి. వాటి పై అధికారులు ఏమి చర్యలు తీసుకుంటారనేది గ్రామంలో చర్చ జరుగుతోంది.
దిక్కుతోచని స్థితిలో బాధితులు కర్కశంగా వ్యవహరించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment