మద్యం దుకాణంపై టాస్క్‌ఫోర్సు దాడి
కంకిపాడు: మద్యం దుకాణంపై టాస్క్ ఫోర్సు బృందం సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడులు జరిపింది. దుకాణం నుంచి అక్రమంగా తరలిపోతున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఉయ్యూరు ఎకై ్సజ్ అధికారులకు అప్పగించింది. ఉయ్యూరు ఎకై ్సజ్ సీఐ శేషగిరిరావు తెలిపిన వివరాల మేరకు... కంకిపాడు పట్టణంలోని ఎస్ వైన్స్‌పై రాష్ట్ర టాస్క్‌ఫోర్సు బృందం ముందస్తు సమాచారం మేరకు దాడి జరిపింది. దాడిలో భాగంగా మద్యం దుకాణం నుంచి బెల్టు షాపులకు తరలిస్తున్న 408 మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకుంది. మద్యం సీసాలతో పాటు కారును సీజ్ చేసింది. ఉయ్యూరు ఎకై ్సజ్ స్టేషన్‌కు అప్పగించింది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి ఇరువురిని, మంగళవారం ఉదయం ఒకరిని అదుపులోకి తీసుకుంది. మద్యం రవాణాలో పాత్ర ఉన్న కె.విద్యాసాగర్, కె.సురేష్, టీ.శ్రీనివాస్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా సీఐ శేషగిరిరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ బెల్టుషాపులను ప్రోత్సహించేది లేదన్నారు. అక్రమంగా మద్యం అమ్మకాలు సాగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిరంతరం గ్రామాలపై నిఘా ఉంటుందని, బెల్టు నడిపితే శిక్ష తప్పదని హెచ్చరించారు.
అక్రమంగా తరలుతున్న 408 మద్యం బాటిళ్లు స్వాధీనం ముగ్గురు వ్యక్తులు అరెస్టు.. కారు సీజ్
Comments
Please login to add a commentAdd a comment