దంత వైద్యానికి ప్రాధాన్యం పెరిగింది
లబ్బీపేట(విజయవాడతూర్పు): దంత వైద్యానికి దేశ విదేశాల్లో ప్రాధాన్యం పెరిగిందని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వి. రాధికారెడ్డి అన్నారు. గుణదలలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాల బీడీఎస్ 2019 బ్యాచ్ గ్యాడ్యుయేషన్ డే వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. నాగార్జునగర్‌లోని పరిణయ కల్యాణ వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి. రాధికారెడ్డి, డీసీఐ సభ్యురాలు డాక్టర్ పి. రేవతి ముఖ్యఅతిథులుగా పాల్గొని కోర్సు పూర్తి చేసిన వారికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు. డాక్టర్ రాధికారెడ్డి మాట్లాడుతూ యువ దంత వైద్యులు పరిశోధనలపై కూడా దృష్టి సారించాలన్నారు. దంత వైద్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారింది. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సేవలు అందించాలన్నారు. ఈ ఏడాది యూనివర్సిటీ పరిధిలోని దంత వైద్య కళాశాలల్లో ఒక సీటు కూడా మిగలకుండా అడ్మిషన్స్ జరిగాయన్నారు. డీసీఐ సభ్యురాలు డాక్టర్ రేవతి మాట్లాడుతూ దంత వైద్యంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం కోర్సు పూర్తి చేసిన వారికి పట్టాలు అందించడంతో పాటు, అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి మెడల్స్ అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని శ్రీనివాసరావు, డాక్టర్ టి. మురళీమోహన్, డాక్టర్ మహబూబ్ షేక్, డాక్టర్ కళాధర్, డాక్టర్ లహరి తదితరులు పాల్గొన్నారు.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటనపై విజయవాడ జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున విజయవాడ–రాయనపాడు సెక్షన్ మధ్యలోని గొల్లపూడి రైల్వేగేటు సమీపంలో వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుని వయస్సు సుమారు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. ఒంటిపై గాయాలను బట్టి ట్రాక్ దాటుతున్న సమయంలో రైలు ఢీకొట్టడంతో చనిపోయినట్లు అనుమానిస్తున్నామన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 88971 56153 నంబర్ లేదా విజయవాడ జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు.
హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ఘనంగా ప్రభుత్వ దంత వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ డే
Comments
Please login to add a commentAdd a comment