ఫ్లోర్‌ బాల్‌ పోటీలను విజయవంతంగా నిర్వహిద్దాం | - | Sakshi
Sakshi News home page

ఫ్లోర్‌ బాల్‌ పోటీలను విజయవంతంగా నిర్వహిద్దాం

Published Fri, Dec 20 2024 1:22 AM | Last Updated on Fri, Dec 20 2024 1:22 AM

ఫ్లోర్‌ బాల్‌ పోటీలను విజయవంతంగా నిర్వహిద్దాం

ఫ్లోర్‌ బాల్‌ పోటీలను విజయవంతంగా నిర్వహిద్దాం

శాప్‌ చైర్మన్‌ రవినాయుడు

విజయవాడస్పోర్ట్స్‌: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫ్లోర్‌ బాల్‌ 18వ జాతీయ అండర్‌–12, అండర్‌–17 బాల బాలికల చాంపియన్‌ షిప్‌ను విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌) చైర్మన్‌ అనిమిని రవినాయుడు పిలుపునిచ్చారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ఫ్లోర్‌ బాల్‌ అసోసియేషన్‌ సీఈవో జోసఫ్‌, ఆట్యాపాట్యా రాష్ట్ర సంఘం సీఈవో ఆర్‌డీ ప్రసాద్‌తో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు ఈ పోటీలు పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కె–రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో జరుగుతాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ఫ్లోర్‌ బాల్‌ అసోసియేషన్‌, ఫ్లోర్‌ బాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల క్రీడాకారులు ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని వెల్లడించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా నిర్వాహకులకు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement