పోస్టర్ ఆవిష్కరించిన శాప్ చైర్మన్ రవినాయుడు
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ అమేచర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు 35వ దక్షిణ భారత స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా అమేచర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. చాంపియన్ షిప్‌నకు సంబంధించిన పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయంలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు గురువారం ఆవిష్కరించారు. గాంధీనగర్‌లోని సర్ విజ్జి మునిసిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్‌లో పోటీలను నిర్వహిస్తున్నామని కృష్ణా జిల్లా అమేచర్ ఆక్వాటిక్ అసోసియేషన్ చైర్మన్ యలమంచిలి వెంకటసురేష్, అధ్యక్షుడు భాస్కర్, కార్యదర్శి వినోద్ తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కృష్ణా జిల్లా అమేచర్ ఆక్వాటిక్ అసోసియేషన్ కోశాధికారి బాలమురళీకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా అమేచర్ ఆక్వాటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment