కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 18–59 ఏళ్లలోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని ఊదరగొట్టారు. అయితే బడ్జెట్‌లో ఈ పథకానికి సంబంఽధించిన ఊసే లేదు. ఎన్టీఆర్ జిల్లాలో 8,30,958 మంది,
కృష్ణా జిల్లాలో 7,39,202 మంది అర్హులైన మహిళలు ఉన్నారు. వీరంతా బాబు మాటను నమ్మి నిండా మునిగామని నిట్టూరుస్తున్నారు.
ఉచిత బస్సు ఊసేలేదు....
ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ కూటమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చింది. కానీ బడ్జెట్‌లో దీని ఊసే లేదు. ఎన్టీఆర్ జిల్లాలో 9.70 లక్షల మంది, కృష్ణా జిల్లాలో 9 లక్షల మంది మహిళలు ఉన్నారు. వీరంతా ఉచిత బస్సు కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు.
కూటమి మోసంపై నిట్టూర్పు...
మొత్తం మీద గత వైఎస్సార్ సీపీ పాలనను, కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో తీపి గుర్తులను తలచుకొంటున్నారు. కూటమి ప్రభుత్వం మోసం చేసిందని నిట్టూరుస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment