చట్టాలపై అవగాహన అవసరం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక
చిలకలపూడి(మచిలీపట్నం): వివిధ అంశాలపై రూపొందించిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక సూచించారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆమె నగరంలోని సబ్‌జైలును సందర్శించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. శిక్ష అనుభవిస్తున్న వారు తమ సంస్థను ఆశ్రయిస్తే ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తామన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న వారు, ఆ శిక్ష పూర్తయిన అనంతరం సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలా జీవనం సాగించాలన్నారు. అనంతరం జైలులో కల్పిస్తున్న సదుపాయాల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీలి ముసలయ్య, జైలు సూపరింటెండెంట్ పిల్లా రమేష్, డెప్యూటీ జైలర్ బొత్స అప్పారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment