రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం
ెపనమలూరు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై పెనమలూరు సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందటంతో పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు గ్రామానికి చెందిన ఆకుల ఏడుకొండలు తన తండ్రి శ్రీమన్నారాయణతో కలిసి ఆటోనగర్‌లో ఫౌండ్రీ నడుపుతున్నాడు. అతని అన్న బాలాజీ(28) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసి కొద్దికాలం క్రితం ఉద్యోగం మాని వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ పెనమలూరులో ఉంటున్నాడు. బాలాజీ కుటుంబ సభ్యులు శ్రీశైలం వెళ్లి రావటంతో కంకిపాడులో ఉన్న బంధువులకు ప్రసాదాన్ని ఇవ్వటానికి అతను బైక్‌పై శుక్రవారం సాయంత్రం బయలుదేరాడు. పెనమలూరు సెంటర్ దాటిన తరువాత ముందు వెళ్తున్న కారు డ్రైవర్ కారును ఒక్కసారిగా బ్రేక్ వేసి ఎడమ పక్కకు తిప్పాడు. వెనుక వస్తున్న బాలాజీ బైక్‌తో కారును ఢీ కొట్టి రోడ్డుపై పడిపోయాడు. అతని తలకు బలమైన గాయమైంది. వైద్య చికిత్సకు అతడిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలికపై లైంగిక దాడికి యత్నం
పెనమలూరు: తాడిగడపలో బాలికపై లైంగిక దాడికి యత్నించిన వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం తాడిగడప కంటి ఆస్పత్రి వద్ద ఓ కుటుంబం నివాసం ఉంటోంది. శుక్రవారం రాత్రి రెండో తరగతి చదువుతున్న బాలిక తమ కుక్క పిల్ల పక్కింట్లోకి వెళ్లటంతో కుక్క కోసం బాలిక పక్క ఇంట్లోకి వెళ్లింది. అయితే ఇంట్లో ఉండే పబ్బుల నారాయణ(60) అనే వృద్ధుడు బాలికను బలవంతంగా ఇంట్లోకి లాక్కొని వెళ్లి లైంగిక దాడి చేయబోయాడు. బాలిక భయంతో కేకలు వేసింది. అతడి నుంచి బాలిక తప్పించుకుని ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment