విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2025
7
నేడు కలెక్టరేట్‌లో ‘పీజీఆర్‌ఎస్’
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్) జరుగుతుందని కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం తెలిపారు.
భక్తుల కోలాహలం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. తెల్లవారుజాము నుంచే రద్దీ ఏర్పడింది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి ప్రభుత్వం పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. తాజాగా నిరుపేదల సొంతింటి కల నెరవేరకుండా కుట్ర పూరితంగా పావులు కదుపుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో స్థలాలు పొంది, ఇళ్లు నిర్మించుకోలేని వారి పట్టాలు రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకొంది. వాటిని తమ అనుచరులకు కట్టబెట్టే కుట్రకు తెరలేపింది. ఈ మేరకు మూడు రోజుల క్రితం జరిగిన కేబినేట్‌లో నిర్ణయం తీసుకొంది. దీంతో పాటు కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలకు సంబంధించి పట్టాలు రద్దు చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర పరిధిలో తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజక వర్గాల్లోని 27 వేల మంది పేదలకు అమరావతి ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇచ్చారు. అందులో 24 వేల మందికి ఇళ్లు సైతం మంజూరు చేశారు. ప్రభుత్వం తీసుకొన్న తాజా నిర్ణయం ప్రకారం ఈ 27వేల మంది పేదల ఇంటి స్థలాల పట్టాలు కూడా రద్దు కానున్నాయి. వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిందే. వీరి కోసం మళ్లీ భూసేకరణ చేయాల్సి ఉంది.
27వేల ఇళ్లు రద్దు!
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగానే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గృహాల నిర్మాణాలు చకచకా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 299 జగనన్న కాలనీల్లో 1,08,836 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 81,240 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇంకా 21,596 ఇళ్లకు సంబంధించి నిర్మాణాలు ప్రారంభం కాలేదు. అలాగే కృష్ణా జిల్లాలో 87,243 ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 15వేల ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. వీటిపైనే ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకున్నాయి.
రాజధానిలో పేదలు ఉండకుండా..
విజయవాడ నగరంలోని తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి సీఆర్‌డీఏ పరిధిలో 27,031 మంది పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల పట్టాలను రద్దు చేస్తున్నారు. అమరావతిలో పేదలు ఉండకూడదనే టీడీపీ పార్టీ పంతాన్ని నెగ్గించుకొంటోంది. పేదలపైన కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు, లేఅవుట్లను చదును చేసి, అంతర్గత రోడ్లు వేశారు. పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడంతో మ్యాపింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయడంతోపాటు, జియోట్యాంగింగ్ చేసి, 24,876 మంది లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేశారు. ఈ నిర్మాణాలకు కేంద్రం ఆమోదం తెలపడంతోపాటు, అప్పటి మంత్రి వర్గం సైతం ఆమోదం తెలిపింది. గృహ నిర్మాణాలకు సైతం శంకుస్థాపన చేసింది. అయితే రాజధాని రైతులు కోర్టు కు వెళ్లడంతో హైకోర్టు ఫుల్ బెంచ్ స్టే ఇవ్వడంతో నిర్మాణాలకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. దానిని తొలగించాలని గత ప్రభుత్వం పేదల తరఫున సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ దశలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీఆర్‌డీఏ పరిధిలో ఇచ్చిన ఇంటి స్థలాల పట్టాలు రద్దు చేస్తోంది. మళ్లీ లబ్ధిదారులను గుర్తించి ఎన్టీఆర్ జిల్లాలో టిడ్కో గృహలను ఇస్తామని మభ్య పెడుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో 260, గుంటూరు జిల్లాలో 210 ఎకరాలు టిడ్కో గృహా నిర్మాణాల కోసం స్థలం అవసరం అవుతోందని, స్థలాన్వేషణ చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. కాలయాపన చేసే ఎత్తుగడకు తెరలేపుతోంది.
విజయవాడ సమీపంలోని జక్కంపూడి కాలనీలో గృహప్రవేశాలు చేసిన జగనన్న ఇళ్లు(ఫైల్)
న్యూస్‌రీల్
అమరావతిలో రద్దయ్యే పట్టాలు ఇలా..
గత ప్రభుత్వంలో గృహ నిర్మాణాల ప్రగతి ఇలా..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో..
గత ప్రభుత్వ హయాంలో ఇంటి నిర్మాణానికి అవసరమై సామగ్రి ఇసుక, సిమెంట్, ఐరన్‌లను లేఅవుట్లకు అందుబాటులో ఉంచారు. ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వీలుగా రోజువారీ ప్రగతిని సమీక్షిస్తూ, వారం వారం లక్ష్యాలను నిర్ధేశించారు. నిర్మాణాలకు ఎదురవుతున్న చిన్న చిన్న ఆటంకాలను తొలగిస్తూ, గృహ నిర్మాణాలను పరుగుపెట్టేలా చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
ఇచ్చిన ఇళ్ల స్థలాల రద్దుకు ప్రణాళిక
ఇళ్లు కట్టుకోని నిరుపేదల
స్థలాలకు ఎసరు
ఎన్టీఆర్ జిల్లాలో 54,627
కుటుంబాలపై ప్రభావం
అమరావతిలో ఇచ్చిన
ఇళ్ల స్థలాలూ లేనట్లే
‘కూటమి’కి అనుకూలమైన
వారికి కేటాయించుకొనే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment