కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ | - | Sakshi
Sakshi News home page

కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ

Published Mon, Jan 20 2025 12:54 AM | Last Updated on Mon, Jan 20 2025 12:54 AM

కీసర

కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ

కంచికచర్ల: మండలంలోని కీసర 65వ నంబర్‌ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద ఆదివారం హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాల రద్దీ బాగా పెరిగింది. సంక్రాంతి పండుగకు దాదాపు 50వేల కార్లతో పాటు ఇతర వాహనాలు వచ్చాయని శనివారం 30వేల వాహనాలు హైదరాబాద్‌ వైపు వెళ్లాయని టోల్‌ప్లాజా మేనేజర్‌ జయప్రకాష్‌ తెలిపారు. ఆదివారం మిగిలిన వాహనాలు వెళ్లాయని అన్నారు. సోమవారం నుంచి పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వాహనాల రద్దీ అధికంగా ఏర్పడిందన్నారు. ప్లాజాలో బూత్‌ల వద్ద ఫాస్టాగ్‌ సిస్టం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలు ముందుకు కదులుతున్నాయన్నారు.

26న డెకథ్లాన్‌

ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ

విజయవాడస్పోర్ట్స్‌: డెకథ్లాన్‌, స్టార్ట్‌ టెన్నిస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన రాష్ట్రస్థాయి ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు స్టార్ట్‌ టెన్నిస్‌ అకాడమీ డైరెక్టర్‌ గోపాలరావు తెలిపారు. విజయవాడ శివారు నిడమానూరులోని స్టార్‌ టెన్నిస్‌ అకాడమీలో అండర్‌–10, 12, 14 బాల, బాలికల విభాగాల్లో పోటీలు జరుగుతాయని వెల్లడించారు. పోటీలో విజేతలకు నగదు బహుమతి, ట్రోఫీలను అందజేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 9553335375(ఆనంద్‌)ను సంప్రదించి ముందస్తుగా ఎంట్రీలను నమోదు చేసుకోవాలని సూచించారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీటీఏఎస్‌ఏ) కృష్ణాజిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. కలెక్టరేట్‌లోని జిల్లా ఖజానాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కేవీ లోకేశ్వరరావు, కార్యదర్శిగా కేవీ రమణ, సహాధ్యక్షుడిగా ఎ. శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా పీవీ నాగేంద్రరావు, ఏఎన్‌వీ ప్రసాద్‌, ఉపాధ్యక్షురాలిగా ఎంవీపీ శ్రీదేవి, సంయుక్త కార్యదర్శులుగా అబ్దుల్‌ వాహబ్‌, వి. శ్రీనివాసరావు, పి. రోజా, కోశాధికారిగా ఎ. సోమశేఖరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులను ఖజానాశాఖ కార్యాలయ సిబ్బంది సత్కరించి అభినందనలు తెలిపారు.

అక్రమంగా గోవులను

తరలిస్తున్న వాహనాలు సీజ్‌

ఉంగుటూరు: గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు వాహనాలను సీజ్‌ చేసినట్లు ఆత్కూరు ఎస్‌ఐ చావ సురేష్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం గోవులను కొందరు వ్యక్తులు వాహనాల్లో అక్రమంగా రవాణ చేస్తున్న సమాచారం అందడంతో ఆదివారం పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. వాహనాలను తనిఖీ చేయగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒక్కో వాహనంలో 23 చొప్పున 45 ఆవులను తరలిస్తున్నట్లు గుర్తించారు. పశువులను తరలిస్తున్న విశాఖపట్నంకు చెందిన కోన జగదీష్‌, కోడిపోయిన బాబ్జి, జిమాడుగులకు చెందిన దొమ్మేటి సాయి, మణికంఠను అరెస్ట్‌ చేసి వాహనాలను సీజ్‌ చేశారు. కాకినాడ, అనకాపల్లి జిల్లాలో పలు ఏజెన్సీ గ్రామాల నుంచి గోవులను చిలకలూరి పేట సంతకు తరలిస్తున్నారని తెలుసుకున్నారు.

ఏప్రిల్‌లో జాతీయస్థాయి నాటికల పోటీలు

యడ్లపాడు: పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం జాతీయ స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఈ ఏడాది ఏప్రిల్‌ 4,5,6 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ ముత్తవరపు సురేష్‌బాబు తెలిపారు. ఆదివారం ఆయన నివాసంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. సురేష్‌బాబు మాట్లాడుతూ ఏప్రిల్‌ మాసంలో పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. పోటీల నిర్వహణ విభిన్న తరహాలో నిర్వహించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కీసర టోల్‌ప్లాజా  వద్ద వాహనాల రద్దీ 1
1/1

కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement