ఉయ్యూరు: బాలికను కిడ్నాప్ చేసి ఆమైపె లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ఉయ్యూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఉయ్యూరు పట్టణ సర్కిల్ కార్యాలయంలో సీఐ టీవీవీ రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ కథనం మేరకు పట్టణానికి చెందిన బాలిక(17)ను గుడివాడ పట్టణానికి చెందిన కొడాలి నాగబాబు ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం చేసుకుని చనువుగా ఉంటున్నాడు. ఈ నెల 14న బాలికను తీసుకువెళ్లి ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. తొలుత కిడ్నాప్ కేసును నమోదు చేసిన పోలీసులు కేసు విచారణ సాగించారు. దర్యాప్తులో భాగంగా నాగబాబును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కిడ్నాప్, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు హాజరుపరిచారు. సమావేశంలో ఎస్‌ఐ విశ్వనాథ్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment