2 నుంచి మోపిదేవిలో బ్రహ్మోత్సవాలు
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి రెండు నుంచి ఆరో తేదీ వరకు ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు.
ముడుపుల వృక్షం
ఆలయ ప్రాంగణంలో శతాబ్దాల నాటి నాగమల్లి వృక్షం ఉంది. నాగమల్లి వేయి పడగలతో లోపల లింగాకా రంతో ప్రకాశిస్తుంది. ఏడాదికి రెండు సార్లు మాత్రమే పుప్వులు విచ్చుకుంటాయి. భక్తులు కోర్కెలు తీర్చాలని కోరుతూ వృక్షానికి ముడుపులు కడతారు. పిల్లల కోసం మహిళలు ఊయల కడుతుంటారు. ఆలయ ప్రాంగణంలోని పుట్టలో పాలుపోసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం విశేషం.
పుష్కరిణిలో తొలిసారిగా తెప్పోత్సవం
దేవాలయలంలోని కోనేరులో తొలిసారిగా స్వామి వారి తెప్పోత్సవానికి దేవదాయశాఖ శ్రీకారం చుట్టింది. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు ఆరో తేదీ గురువారం సాయంత్రం ఆరు గంటలకు తెప్పోత్సవం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment