ఈఎస్‌ఐ నోట.. ప్రైవేట్ పాట
‘ఘన’తంత్ర ఏర్పాట్లు
నాలుగు జిల్లాలకు రిఫరల్ ఆస్పత్రి. ఆరు లక్షల మంది చందాదారులకు వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత. అయితే ఈ ఆస్పత్రిలో ఒక్క ఆపరేషన్ థియేటర్ కూడా లేదు. ఇదీ విజయవాడ గుణదలలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి దుస్థితి. అవ్యవసర ఆపరేషన్ చేయా ల్సిన సమయాల్లోనే కాదు.. సాధారణ పరిస్థితుల్లోనూ రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించాల్సి వస్తోంది. ఆస్పత్రి తీరుతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టేడియం మొత్తాన్ని మువ్వన్నెల జెండాతో అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. వివిధ శాఖలకు సంబంధించిన శకటాలు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
ఇటీవలే సిద్ధం చేశాం
ఈఎస్‌ఐ ఆస్పత్రిని కొత్త ప్రాంగణంలోకి మార్చిన తర్వాత కొంతకాలం థియేటర్ అందుబాటులో లేదు. ఇటీవల థియేటర్‌ను సిద్ధం చేశాం. చిన్న కేసులకు సేవలు అంది స్తున్నాం. పెద్ద సర్జరీలు అవసరమైతే విజయవాడలోని పలు ఆస్పత్రులతో పాటు ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నాం.
– డాక్టర్ వి.జ్యోతి,
సూపరింటెండెంట్, ఈఎస్‌ఐ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment