ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు పునాది వంటిదని, ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖరబాబు సూచించారు. జాతీయ ఓటర్ల దినో త్సవాన్ని పురస్కరించుకుని శనివారం విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రి నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని వారు ప్రారంభించారు. ‘ఓటు వజ్రాయుధం’, ‘ఓటు వేయడం హక్కు మాత్రమే కాదు సామా జిక బాధ్యత’, ‘ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమే’ వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు చేబూని విద్యార్థినీ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. రాజ్యాంగం పౌరులందరికీ ఓటు హక్కు కల్పించిందన్నారు. కులం, మతం, జాతి వివక్ష లేకుండా పొందిన ఓటు హక్కును పవిత్ర హక్కుగా భావించాలని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం దేశంలోని యువత చిత్తశుద్ధితో ఓటును వినియోగించుకుని ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేందుకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఓటర్ల నమోదుకు యువత కృషి చేయాలి
పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లా డుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం కలిగి స్వచ్ఛమైన వాతావరణంలో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చూడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పౌరులను చైతన్యవంతులను చేసి ఓటర్లుగా నమోదు చేసే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ చైతన్య, ఎన్‌ఎస్‌ఎస్ స్టేట్ కో ఆర్డినేటర్ చంద్రమౌళి, జిల్లా కో ఆర్డినేటర్ కె.రమేష్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి.యుగంధర్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కో ఆర్డినేటర్ అరవ రమేష్, వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
అవగాహన ర్యాలీలో కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు
Comments
Please login to add a commentAdd a comment