చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాపంపిణీ వ్యవస్థలో 6ఏ కేసుల్లో స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని బహిరంగ వేలం వేస్తామని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసుల్లో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న 739.11 క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యాన్ని తన సమక్షంలో ఈ నెల 31వ తేదీ కార్యాలయం వద్ద ఉదయం 10.30 గంటలకు బహిరంగ వేలం జరుగుతుందని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే వారు 30వ తేదీ జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో ఉన్న శాంపిల్ బియ్యాన్ని పరిశీలించుకుని 31వ తేదీలోగా డిపాజిట్ రూ.50 వేలను జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారికి చెల్లించి నిర్ణీత నమూనాలో దరఖాస్తులు సమర్పించి వేలంలో పాల్గొనాలని వివరించారు. వేలంలో పాల్గొనేవారు జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, దరావత్తు సొమ్ము వేలంపాట సమయంలో సమర్పించాలని తెలిపారు. 6ఏ కేసులు నమోదై పెండింగ్‌లో ఉన్న వారు వేలంపాటలో పాల్గొనేందుకు అనర్హులని జేసీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment