నేటి నుంచి కార్తికేయుడి వార్షిక బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కార్తికేయుడి వార్షిక బ్రహ్మోత్సవాలు

Published Sun, Feb 2 2025 1:34 AM | Last Updated on Sun, Feb 2 2025 1:34 AM

నేటి

నేటి నుంచి కార్తికేయుడి వార్షిక బ్రహ్మోత్సవాలు

మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. వేదపండితులు కొమ్మూరి ఫణికుమార్‌ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ ప్రధానార్చకుడు బుద్దు పవన్‌కుమార్‌ శర్మ నేతృత్వంలో భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధి కారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు శనివారం తెలిపారు. ఆలయ ప్రాంగణంలో, వెలుపల చలువ పందిళ్లు వేశామన్నారు. నాలుగో తేదీ రాత్రి జరిగే రథోత్సవం, ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటలకు పుష్కరిణిలో నిర్వహించే శ్రీస్వామివారి తెప్పోత్సవానికి ప్రత్యేకంగా డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తామన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

పెనమలూరు: విద్యారంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన చేయాలని వన్‌మెన్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌రంజన్‌మిశ్రా సూచించారు. ఆయన శనివారం పెనమలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ల్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొని పాఠశాలలో ఉన్న వనరును సమర్థవంతంగా ఉపయోగించుకొని విద్యార్థులకు పాఠాలు చెప్పాలన్నారు. పాఠశాల విద్యా కమిషనర్‌ వి.విజయరామరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్డీ డైరెక్టర్‌ ఎం.వి.కృష్ణారెడ్డి, పాఠశాలల పరీక్షల విభాగం డైరెక్టర్‌ కె.శ్రీనివాసరెడ్డి, పాఠశాల టెక్ట్స్‌ బుక్స్‌ డైరెక్టర్‌ డి.మధుసూదనరావు, కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి పి.వి.జె.రామారావు, ఉప విద్యాశాఖ అధికారి ఐ.పద్మారాణి, హెచ్‌ఎం వై.దుర్గాభవాని, ఎస్‌ఎంసీ చైర్మన్‌ కై రున్‌బీ పాల్గొన్నారు.

సజావుగా సామాజిక పింఛన్‌లు పంపిణీ

ఇబ్రహీంపట్నం/కంచికచర్ల: రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని పటిష్ట పర్యవేక్షణతో సామాజిక పింఛన్ల పంపిణీని చేపట్టామని కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. పింఛన్ల పంపిణీలో భాగంగా కంచికచర్ల మండలంలోని పరిటాల, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో కలెక్టర్‌ శనివారం పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీవెళ్లి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. తొలి రోజు జిల్లాలో 2,29,913 మంది లబ్ధిదారులకు రూ.98.20 కోటు పంపిణీ చేశామన్నారు.

నున్న పీఎస్‌ తనిఖీ

పాయకాపురం(విజయవాడరూరల్‌): నున్న రూరల్‌ పోలీసుస్టేషన్‌ను శనివారం పోలీసు అధికారులు తనిఖీ చేశారు. ట్రైనీ ఐపీఎస్‌ అధికారి మౌనిక, నార్త్‌ ఏసీపీ డాక్టర్‌ స్రవంతి రాయ్‌తో కలిసి పోలీసుస్టేషన్లో రికార్డులను పరిశీలించారు. లా అండ్‌ ఆర్డర్‌, క్రైమ్‌ రికార్డులను క్షణ్ణంగా చూశారు. ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ట్రైనింగ్‌ లో భాగంగా రికార్డులను తనిఖీ చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
నేటి నుంచి కార్తికేయుడి వార్షిక బ్రహ్మోత్సవాలు
1
1/1

నేటి నుంచి కార్తికేయుడి వార్షిక బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement