ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మాఘ శుద్ధ పంచమి (శ్రీపంచమి)ని పురస్కరించుకుని ఈ నెల మూడో తేదీన ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. సరస్వతీదేవి జయంతిని పురస్కరించుకుని మూలవిరాట్‌తో పాటు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని విశేషంగా అలంకరిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు పంపిణీ చేసే పెన్నులు, కంకణాలను ఆలయ మూలవిరాట్ చెంత ఉంచుతారు. దేవస్థానం యాగశాలలో సరస్వతీ యాగాన్ని నిర్వహించేందుకు వైదిక కమిటీ ఏర్పాట్లు చేసింది. మూడో తేదీ ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడు గంటల వరకు విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పించి పెన్నులు అందజేస్తారు. విద్యార్థులు స్కూల్, కాలేజీ యూనిఫాం ధరించి గుర్తింపు కార్డు తీసుకురా వాలని ఆలయ అధికారులు సూచించారు. పెన్నుతో పాటు అమ్మవారి రక్ష కంకణం, పాకెట్ సైజు ఫొటో, ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీకి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. సుమారు 40 వేల మంది విద్యార్థులు ఇంద్రకీలాద్రికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment