విద్యార్థుల భవిష్యత్ గాలికొదిలేసిన కూటమి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్
పామర్రు: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ‘ఫీజు పోరు’ కార్యక్రమం వాల్ పోస్టరును శనివారం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కై లే మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమం ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి వారి భవిష్యత్తుని అంధకారం చేస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ నిరంకుశ తీరుకు నిరసనగా ఈ నెల 5వ తేదీన మచిలీపట్నంలో కలెక్టరేట్ వద్ద ఫీజు పోరు నిరసన చేపడుతున్నామని వెల్లడించారు. మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయానికి శాంతియుతంగా ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు పలు డిమాండ్ల్‌తో కూడిన వినతి పత్రాన్ని అందిస్తామని చెప్పారు. జిల్లాలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ నిరసన ర్యాలీకి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు ఆరేపల్లి శ్రీనివాసరావు, ఆరుమళ్ల రమాదేవి, ఎంపీటీసీ సభ్యులు తాడిశెట్టి శ్రీనివాసరావు, పి.రత్నకుమారి, కె.నాగ మల్లేశ్వరరావు, పార్టీనాయకులు పెయ్యల రాజు, నత్తా నాని, చిన్నం శ్రీనివాసరావు, పంచకర్ల సందీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment