మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
పెనమలూరు: యనమలకుదురు గ్రామంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీరామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆహ్వాన పత్రికను గురువారం ఆలయంలో ఆలయ నిర్మాణ దాత సంగా నరసింహారావు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.భవాని, స్వామివారి కల్యాణం చేసే భక్తులు అయోధ్య శ్రీనివాసరావు, నరసమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో భవాని వివరాలు తెలుపుతూ ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు రామలింగేశ్వర స్వామిఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment