![ప్రజలకు మరింత విస్తృత సేవలందించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09vie41-310147_mr-1739129150-0.jpg.webp?itok=7Ho5He1v)
ప్రజలకు మరింత విస్తృత సేవలందించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): పాతికేళ్లుగా అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు సేవలందిస్తున్న కార్డియాలజిస్టు డాక్టర్ పళ్లెం పెద్దేశ్వరరావు సారథ్యంలో అధునాతనంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో మరింత విస్తృత సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సూర్యారావుపేటలో మల్టీ స్పెషాలిటీ, ట్రామా, క్రిటికల్ కేర్ విభాగాలతో అధునాతనంగా రూపుదిద్దుకున్న పెద్దేశ్వర్ హెల్త్‌కేర్ సెంటర్‌ను ఆదివారం హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ మన్నవ గోపీచంద్‌తో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ పెద్దేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిటికల్ కేర్ సెంటర్‌గా ఆధునీకరించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మరింత విస్తృతంగా సేవలందిస్తామన్నారు. ఆస్పత్రి సీఈఓ డాక్టర్ ఆకాష్ పళ్లెం మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించే లక్ష్యంతో కృషి చేస్తున్నామన్నారు. మొత్తం 150 పడకల ఆస్పత్రిలో 8 ఐసీయూలతో 100 క్రిటికల్ కేర్ బెడ్స్ ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, గద్దే రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, డాక్టర్ సీహెచ్ ప్రసాద్ బాబు, డాక్టర్ ఎస్.భాను ప్రభాకర్, డాక్టర్ వి.సుశాంత్ రెడ్డి, డాక్టర్ సింధు చాగంటి, డాక్టర్ పవన్ సాయి పోతుల, డాక్టర్ కె.శ్రీనివాస్ బాబు, డాక్టర్ రామ్ ప్రతాప్ కొనకళ్ల, డాక్టర్ కె.రామ్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దేశ్వర్ హెల్త్‌కేర్ సెంటర్ ప్రారంభోత్సవంలో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment