ఒడిశా: పెళ్లి పిలుపులకు వెళ్తూ కుటుంబం మొత్తం దుర్మరణం పాలైన విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం కొరాపుట్ జిల్లా పొట్టంగి–సిమిలి గుడల మధ్య పుంగార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.
జయపుర్ పట్టణంలోని పుర్ణాఘఢ్ ప్రాంతానికి చెందిన రవి ప్రధాన్(35), అతని భార్య రస్మితా ప్రధాన్(32), కుమార్తె మహి ప్రధాన్ (6)లు కారులో సిమిలి గుడ సమితి మాలిమర్ల గ్రామానికి బయల్దేరారు. మృతుడు బావ మరిది పెళ్లి ఉండడంతో ఆడపెళ్లి వారిని పెళ్లి పిలుపు కోసం వెళ్తున్నారు. అదే సమయంలో గంజాం జిల్లా నుంచి ఆసిడ్ ట్యాంకర్‌తో దమంజోడిలో భారత ఆల్యూమినియం కేంద్రం(నాల్కో)కి లారీ వస్తోంది.
రెండు వాహనాలు జాతీయ రహదారి మీద ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ఉన్నవారు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను క్రమబద్ధీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment