సివిల్స్ విజేత కళ్యాణిని సత్కరిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ లక్ష్యంతో పనిచేస్తే తప్పక విజయం సిద్ధిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. డాక్టర్ దానేటి శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం పాతబస్టాండ్ సమీపంలో సిక్కోలు ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుందన్నారు. డాక్టర్ శ్రీధర్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి మాట్లాడుతూ వైద్య రంగంలో ఉన్నత స్థాయికి చేరిన శ్రీధర్ సేవా రంగంలోనూ అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తాను కష్టపడి చదివి వైద్య నిపుణుడిగా రెండు దశాబ్దాలకు పైగా ప్రజల్లో గుర్తింపు పొందానన్నారు. ట్రస్టును విజయవంతంగా నిర్వహించేందుకు కన్వీనర్ బాధ్యతను డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావుకు అప్పగిస్తున్నామన్నారు. అనంతరం జిల్లా నుంచి ఐఏఎస్‌కు ఎంపికై న చల్ల కళ్యాణి, జాతీయ స్థాయి నీట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన పొట్నూరు అశీష్‌లను సత్కరించారు. సిక్కోలు ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ కోసం రూ.20 లక్షల చెక్కును డాక్టర్ శ్రీధర్ అతిథుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ విద్యార్థులను ఉత్తేజపరిచేలా ప్రసంగించారు. కార్యక్రమంలో ఎస్పీ జి.ఆర్.రాధిక, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎం.వి.స్వరూప్, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్‌రావు, డాక్టర్ దానేటి రాధ, దానేటి మహతి, డాక్టర్ పొట్నూరు సూర్యం, రిటైర్డ్ డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు, విద్యావేత్తలు డాక్టర్ జామి భీమశంకర్, దుప్పల వెంకటరావు, డాక్టర్ నిక్కు అప్పన్న, అంధవరపు ప్రసాద్, సంతోష్, సువ్వారి గాంధీ, సిరిపురం తేజేశ్వరరావు, కొంక్యాన మురళీధర్, కొంక్యాన వేణు, ఈఈ పొగిరి సుగుణాకర్, బుడుమూరు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
సిక్కోలు ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు
Comments
Please login to add a commentAdd a comment