విద్యుత్ షాక్‌తో మృతి చెందిన పైడినాయుడు
మెరకముడిదాం: మండలంలోని ఇప్పలవలస గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఒక రైతు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇప్పలవలస గ్రామానికి చెందిన రౌతు పైడినాయుడు శుక్రవారం రాత్రి తన పొలం చేసేందుకు వెళ్లాడు. అయితే అప్పటికే తెగిపడి వున్న విద్యుత్ తీగలను పైడినాయుడు గమనించకపోవడంతో ఆ తీగలు కాలికి తగిలాయి. దీంతో పైడినాయుడు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పొలానికి వెళ్లిన పైడినాయుడు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా పైడినాయుడు పొలంలో విగతజీవిగా పడి వుండడాన్ని గమనించి ఒక్కసారిగా గొల్లుమన్నారు. మృతుడికి భార్య సింహాచలం, ఇద్దరు కుమార్తెలు వున్నారు. పైడినాయుడు వ్యవసాయం చేసుకుంటూ కుటంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు కుటుంబ పెద్ద దిక్కు మృతి చెందడంతో తాము దిక్కులేని వాళ్లమయ్యామని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న బుధరాయవలస హెడ్ కానిస్టేబుల్ వై.అప్పారావు సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమో దు చేసి మృతదేహాన్ని చీపురుపల్లి సీహెచ్‌సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment