శ్రీ మందిరంలో పుష్పాభిషేకం
భువనేశ్వర్: పవిత్ర పుష్య పూర్ణిమ తిథి పురస్కరించుకుని శ్రీ జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరంలో పుష్పాభిషేకం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. పుష్పాభిషేక పూర్ణిమ, దేవాభిషేక పూర్ణిమగా ప్రతీతి. ఏటా మకర సంక్రాంతి సందర్భంగా ముందు రోజున ఆచారంలో భాగంగా సోమవారం ఈ అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నవాంక అలంకరణ చేయడం ప్రత్యేకత. ఈ అలంకరణలో మూల విరాట్లు పూలతో గుబాళించారు. మూల విరాట్లను పూల కిరీటాలు, మాలలతో అలంకరించారు. శ్రీ మందిరం మాలీ సేవకులు ముఖాలకు తుండు చుట్టుకుని దేవుళ్లకు అలంకరించాల్సిన పూల పాత్రతో శ్రీ మందిరం ప్రధాన ప్రాంగణం ఒక మారు ప్రాకార ప్రదక్షిణ నిర్వహించి గర్భాలయానికి చేరదీస్తారు. ఖుంటియా సేవకులు సంధ్యా హారతి సమాయంలో వీటిని అలంకరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment