అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
మల్కన్‌గిరి: జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని నవరంగ్‌పూర్ ఎంపీ బోలభద్స మాఝి శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అభివృద్ధి సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించి తెలిపారు. రైల్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడంపై అధిక ప్రాధాన్యమిచ్చారు. మల్కన్‌గిరి వంటి గిరిజన జిల్లాలో విద్య, ఆరోగ్య రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ పనులు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటికి సాగునీరు, తాగునీరు, విద్యుత్, పశువుల పెంపకం, పాల ఉత్పత్తి, చేపల పెంపకం వంటి రంగాల్లో స్వావలంబనం సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్యలో నాణ్యత పెంపు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పలు మార్గాల ద్వారా ప్రజలకు అందించడంపై చర్చించారు. ప్రధానమంత్రి జన కల్యాణ యోజన, ముద్రాయోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల ప్రయోజనాలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సంగ్ మడ్కమి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టంగులు, చిత్రకొండ ఎమ్మెల్యే మాంగు ఖీలో, గోవింద పాత్రో, మల్కన్‌గిరి కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, అటవీ శాఖ అధికారి ప్రతాప్ కొత్తపల్లి, జిల్లా అదనపు కలెక్టర్ వేద్‌బర్ ప్రధాన్, జిల్లా అబివృద్ధి అధికారి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment