డెంగీ, మలేరియాపై అప్రమత్తంగా ఉండాలి
● జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి
జయపురం: కొరాపుట్ గ్రామీణ ప్రాంతాల్లో దోమల వలన సంక్రమించే మలేరియా, డెంగీ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మలోని కమ్యూనిటీ ఆస్పత్రిలో మందులతో కూడిన దోమతెరలు ప్రజలకు శుక్రవారం వితరణ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో మలేరియా జ్వరాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రత్తంగా ఉండాలన్నారు. దోమల బారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఔషధంతో కూడిన దోమతెరలను ప్రజలకు సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. వీటిటి కచ్చితంగా వినియోగించుకోవాలని సూచించారు. అవగాహన లేమి కారణంగా చాలామంది దోమతెరలను వినియోగించకుండా మూల పడేస్తున్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఔషధ దోమ తెరలు అందజేశామని మలేరియా బాధితులను వైద్యులు విస్మరించరాదని హితవు పలికారు. బొరిగుమ్మ కమ్యూనిటీ ఆస్పత్రి అధికారి డాక్టర్ శ్రీకాంత కుమార్ శతపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కొరాపుట్ ఎంపీ ప్రతినిధి రామచంద్ర పాఢీ, జయపురం ఎమ్మెల్యే ప్రతినిధి అశోక్ గంతాయిత్‌బొరిగుమ్మ, వ్యాపారుల సంఘ అధ్యక్షులు సూర్య ఆచారి, రోగీ కళ్యాణ సమితి సభ్యులు కై లాశ రథ్, మహిళా ప్రసూతి విభాగ అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ దాస్, బీపీఎం సరోజ్ కుమార్ మహాపాత్రోతో పాటు దమయంతి ముదులి, శ్రీనివాస రావు, సబిత సాహు, గొలక్ బీహారి చౌధురి, ఉర్మిళ మఝి పాల్గొన్నారు. దోమతెలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎం.ఎల్.ఎ కు హాస్పిటల్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment