52 యూనిట్ల రక్తం సేకరణ
జయపురం: కొరాపుట్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్.కె.టి.రోడ్డు జయపురం వారు నిర్వహించిన రక్తదాన శిబిరంలో 52 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. స్థానిక నెహ్రూనగర్ అగ్రసేన్ భవనంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం మహత్తర మైనదన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. రక్తదానంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. సకాలంలో అవసరమైన గ్రూపు రక్తం లభించక క్షతగాతలు, రక్తహీనులు మ త్యువాత పడుతున్న సంఘటలను ఉన్నాయన్నారు. సమాజంలో రక్తం లేమి కారణంగా ఎవరూ మరణించకూడదంటే అర్హులందరూ రక్తదానానికి ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి రక్తభండార్ అధికారి డాక్టర్ చిన్మయ కుమార్ జెన, డాక్టర్ సభ్యసాచి మహాపాత్రో, జయపురం సబ్‌డివిజన్ రక్త దాతల మోటివేటెడ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో, అసోసియేషన్ అధ్యక్షుడు డి.కష్టారావు, కార్యదర్శి కాళీ ప్రసాద్ పట్నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment