బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో శనివారం నుంచి శ్రీవిద్యా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డీఎన్‌రావు, పద్మావతి దంపతులు పూర్ణకుంభంతో ఉత్సవాలు ప్రారంభించగా, నరసన్నపేట ఆచార్యులు చామర్తి శ్రీనివాసచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు అరవెల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో మంగళ శాసనాలు, విశ్వక్షేరాధన, సాయంత్రం గరుడ వాహనంపై తిరువీధి ఉత్సవం జరిగాయి. మూడు రోజుల పాటు క్యాంపస్‌లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని అరవెల్లి శేఖరాచార్యులు తెలియజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా.దుర్గాపాఢి, లక్ష్మీపతి రాజు (రాసూరు) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment