గెలుపు, ఓటములు సహజమే
రాయగడ: రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు అన్నారు. స్థానిక తేజస్వీ హోటల్ సమీపంలోని ఆ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలంతా బీజేడీతోనే ఉన్నారని, భవిష్యత్‌లో పార్టీ మరింత బలంగా ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని బీజేపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఎక్కడకు వెళ్లినా ఆయనకు ప్రజలు నీరాజనాలు పలుకుతుండడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఏదిఏమైన్పటికీ కార్యకర్తలు ఓటమి షాక్ నుంచి తేరుకొని భవిష్యత్‌లో పార్టీ విజయానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
● బీజేడీ హయాంలో అభివృద్ధి
కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నయాగడ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ అరుణ్ కుమార్ సాహు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేడీ హయాంలో ప్రజలు ఎటువంటి సౌకర్యాలు పొందారో అందరికీ తెలిసిందేనన్నారు. ఆరు నెలల బీజేపీ పాలనలో ప్రజలు అగచాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పాటు ఎటుచూసినా రైతుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయన్నారు. బీజేడీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతీ జిల్లాలో కార్యకర్తల సమావేశాన్ని అధిష్టానం నిర్వహిస్తుందని తెలిపారు. కార్యకర్తలు సమైఖ్యతా భావంతో ముందుకు నడవాలని సూచించారు. పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ బీజేడీ మాజీ జిల్లా అధ్యక్షుడి వ్యవహార శైలి ఈ పరాజయానికి కారణమైందన్నారు. సమావేశంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
నెక్కంటి భాస్కరరావు
Comments
Please login to add a commentAdd a comment