మెరిసిన కిశోర్ చంద్ర రథ్
5వ ఓపెన్ మాస్టర్ గేమ్స్‌లో
పర్లాకిమిడి: బ్యాంకాక్‌లో జనవరి 18 నుంచి జరుగుతున్న ఐదో ఓపెన్ మాస్టర్ గేమ్స్‌లో పర్లాకిమిడికి చెందిన క్రీడాకారుడు, విశ్రాంత ఎకై ్సజ్ ఎస్‌ఐ కిశోర్ చంద్ర రథ్ ఒక బంగారు పతకం, బ్రాంజి మెడల్‌ను కై వసం చేసుకున్నారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఆర్.బి.యస్.సీ. పోలోబ్యాంకు గ్రౌండ్స్‌లో జరగుతున్న 5వ ఓపెన్ మాస్టర్స్ గేమ్స్‌లో 37 దేశాల క్రీడాకారులు పాల్గొనగా, భారత్ నుంచి 42 మంది క్రీడాకారులు ఉన్నారు. కిశోర్ చంద్ర రథ్ 100ఫ4 మీటర్ల రిలే రేస్‌లో గోల్డు మెడల్, ట్రిపుల్ జంప్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. కిశోర్ రథ్ విజయంపై జిల్లా క్రీడాశాఖ అధికారి ప్రాణకృష్ణ పాణిగ్రాహి, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ పలు అంతర్జాతీయ క్రీడా వేదికలలో కిశోర్ చంద్ర రథ్ బంగారు, కాంస్య పతాకాలు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment