విక్రమదేవ్ వర్సిటీలో జాతీయ సెమినార్
జయపురం: జయపురం విక్రమదేవ్ వర్మ విశ్వవిద్యాలయ శిక్షక శిక్షా (టీచర్స్ ఎడ్యుకేషన్) విభాగంవారు ’వికసిత్ భారత్ విజన్, చాలెంజేస్ అండ్ ఆపర్చూనిటాస్’ అనే అంశంపై శుక్రవారం జాతీయ సెమినార్ ప్రారంభించారు. రెండు రోజులు నిర్వహించే సెమినార్‌ను వర్సిటీ కులపతి ప్రొఫెసర్ దేవీప్రసాద్ మిశ్ర ప్రారంభించారు. ఎన్‌సీఈఆర్‌టీ న్యూఢిల్లీ ప్రాక్తన్ డైరెక్టర్, భువనేశ్వర్ ప్రాంతీయ శిక్షా ప్రతిష్టాన్ ప్రొఫెసర్ డాక్టర్ హృషికేష్ సెనాపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్‌ఐఈ(ఎన్‌సీ.ఆర్‌టీ) రిటైర్డ్ ప్రిన్సిపాల్, స్టేట్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ నిత్యానంద ప్రధాన్ ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ఉన్నత విద్యా స్థానిక విభాగ డైరెక్టర్ డాక్టర్ గోపాల హల్దార్ గౌరవ అతిథిగా పాల్గొని వికసిత్ భారత్ విజన్‌లో విద్య, ఉపాధ్యాయుల పాత్రపై ప్రసంగించారు. ప్రసిద్ధ పత్రిక కుంధ కలిక, పాఠ్యాంశాలు, చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సెమినార్ ప్రారంభించారు. సెమినార్‌లో ఆహ్వానితులు, స్నాతకోత్తర పరిషత్ అథ్యక్షులు డాక్టర్ ప్రచండ కుమార్ పాత్రో స్వాగతోపన్యాసం చేశారు. సెమినార్ కోఆర్డినేట్ కమిటీ కార్యదర్శి, శిక్షక శిక్షా విభాగ చీఫ్ డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ సెమినార్ లక్ష్యాన్ని వివరించారు. సెమినార్ లో పాల్గొన్న వారికి జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ లోకేష్ ప్రధాన్ ధన్యవాదాలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment