ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: పండగ పూట ఓ కుటుంబంలో విషాదం అలముకుంది. రెండు రోజుల కిందట విశాఖ పట్నం నుంచి తన సొంత గ్రామమైన పెద్దసాన గ్రామం వచ్చి తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి తిరిగి తన భార్య, పిల్లలు దగ్గరకు వెళ్తుండగా మృత్యువు ఓ బస్సు రూపంలో వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెద్దసాన గ్రామం హరిజన వీధికి చెందిన గందాపు అప్పారావు(54) అనే వ్యక్తి గత కొంత కాలంగా విశాఖపట్నంలో భార్య గీత, కుమారుడు శివసాయి తో కలసి కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ప్రతి పండుగ సందర్భంగా అప్పారావు తన సొంత గ్రామానికి వచ్చి భోగి రాత్రి మళ్లీ వెళ్లిపోతాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట విశాఖపట్నం నుంచి పెద్దసాన వచ్చి తిరిగి సోమవారం రాత్రి విశాఖపట్నం వెళ్లేందుకు కె.కొత్తూరు సమీపంలో జాతీయ రహదారి మధ్యలో గల డివైడర్‌ను దాటుతుండగా.. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో అప్పారావు తలకు తీవ్రగాయాలు కావడంతో హు టాహుటిన హైవే అంబులెన్స్‌లో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పారావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై టె క్కలి పోలీసులకు సమాచారం అందించారు. సమా చారం అందుకున్న సీఐ విజయ్‌కుమార్ వివరాలు సేకరించి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment