బీజేపీ నేత ఇంటిలో 250 కిలోల గంజాయి లభ్యం
జయపురం: కొరాపుట్ జిల్లా బీజేపీ యువమోర్చ ఉపాధ్యక్షుడి ఇంటిలో జయపురం పట్టణ పోలీసులు గంజాయి పట్టుకున్నట్లు జయపురం పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్ దొలాయి తెలిపారు. మంగళవారం రాత్రి పట్టణ పోలీసులు పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో ప్రసాద్ రావు పేట రెండో లైన్‌లో జిల్లా బీజేపీ యువమోర్చ ఉపాధ్యక్షుడు ఎ.దుర్గ ఇంటీలో గంజాయి ఉందన్న సమాచారం రాగా.. పోలీసులు వెళ్లి సోదా చేశారు. అక్కడ 50 ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాకింగ్ చేసి ఉన్న గంజాయి పట్టుబడింది. మెజిస్ట్రేట్ సమక్షంలో గంజాయి తూయించగా 250 కిలోలు ఉన్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు. దాడి జరిపిన సమయంలో ఆ ఇంటిలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వాసి ఉన్నాడని వెల్లడించారు. అతడిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర గౌతమబుద్ధ జిల్లా రఘుపతి కంధార పోలీసు స్టేషన్ రామపుర గ్రామానికి చెందిన మితున్ నాథ్ అని వెల్లడించారు. అలాగే బీజేపీ నేత ఎ.దుర్గను పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించామని పోలీసు అధికారి దొలాయి వెల్లడించారు. నిందితుడు మితున్ నాథ్ గత 20వ తేదీ నుంచి ఇక్కడ అద్దెకు ఉంటున్నట్లు దుర్గ చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. ఈ గంజాయి రవాణాలో ఇంకా ఎవరెవరు ఉన్నారో దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment