27న జయపురం–అయోధ్యకు వోల్వో బస్సు
జయపురం: జయపురం నుంచి అయోధ్య వెళ్లేందుకు ఈ నెల 27న వోల్వో బస్సును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కుంభమేళా వెళ్లేందుకు బస్సు వేయాలని పలు సంఘాలు సబ్ కలెక్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తులు పంపాయి. ప్రజల కోరిక మేరకు ఈ నెల 27వ తేదీ నుంచి జయపురం, కొరాపుట్‌ల నుంచి అయోధ్యకు బస్సు వేస్తున్నారు. ఓఎస్‌ఆర్‌టీసీ చెందిన ఈ బస్సు 27 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు 5 పర్యాయాలు కొరాపుట్ నుంచి అయోధ్యకు రాకపోకలు సాగిస్తుంది. ఈ బస్సులో 51 సీట్లు ఉండగా ఇప్పటికే ప్రథమ ట్రిప్పు కోసం 50 టికెట్లు బుక్ అయ్యాయి. ఈ బస్సు కొరాపుట్‌లో బయల్దేరి జయపురం, నవరంగపూర్, పపడహండి, ఉమ్మరకోట్, రాయిఘర్, కాంకర్, రాయపూర్, ఉల్లాసపూర్, అంబికాపూర్, రాణీకుట్, వారణాశి, ప్రయోగరాజ్‌ల మీదుగా అయోధ్య చేరుతుంది. ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు కొరాపుట్‌లో బయల్దేరి జయపురం కొత్త బస్టాండ్ కు 9.30 గంటలకు చేరి 9.35 గంటలకు బయలు దేరి మరునాడు 11.35 గంటలకు అయోధ్య చేరుతుంది. డౌన్ ట్రిప్ లో ఈ నెల 31 వ తేదీన అయోధ్య నుంచి ఉదయం 9 గంటలకు బయల్దేరి కుంభ మేళా యాత్రికులతో ఫిబ్రవరి 1 వ తేదీన చేరుతుంది. అలాగే ఫిబ్రవరి 2వ తేదీన, 10న, 17న, 24 వ తేదీలలో కొరాపుట్ జిల్లా నుంచి యాత్రికులతో బయలుదేరి తిరిగి వారిని తీసుకు వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment