మార్మోగిన సాయి నామం
● సత్యసాయి సమితుల రాష్ట్ర స్థాయి సదస్సు ప్రారంభం
రాయగడ: స్థానిక తేజస్వీ మైదానంలో గురువారం రాష్ట్ర స్థాయి సత్యసాయి సమితుల 49వ సదస్సు ప్రారంభమైంది. నలుమూల నుంచి వచ్చిన భక్తుల సాయి నామస్మరణతో పట్టణం మార్మోగింది. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సత్యసాయి సేవా సమితి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ సత్య స్వరూప్ పట్నాయక్, జిల్లా అధ్యక్షుడు ఎస్.వి.రమణ మూర్తి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. సాయిబాబా ఫొటోతో నిర్వహించిన ఈ ర్యాలీలో మహిళలు కలశాలను పట్టుకుని పాల్గొన్నారు. సాయి భక్తులు సాయి నామస్మరణం భజన కీర్తనలతో పాల్గొన్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వారి సంప్రదాయ దుస్తులతో ర్యాలీలొ పాల్గొనడం విశేషం. ఇదిలా ఉండగా సాయి మందిరం వద్ద ఈ సందర్భంగా ఆధ్యాత్మిక పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కేంద్రాల నుంచి వచ్చిన మహిళలు, యువత, సాయి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు, సత్యసాయి శత జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. మూడు రోజులపాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment