ఘనంగా నివాళి
శుక్రవారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2025
నేతాజీకి ..
పర్లాకిమిడి:
స్థానిక ఒకటోనంబరు వార్డు సుభాష్ నగర్‌లో గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్, సురేంద్ర సాయి జయంతి వేడుకలు సరస్వతి శిశు విద్యామందిర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎస్పీ జితేంద్ర కుమార్ పండా ముఖ్యఅతిథిగా విచ్చేసి సుభాష్ చంద్రబోసు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో దేవీమఠం మహాంత రామానంద దాస్, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ రాజేంద్ర మింజ్, డిప్యూటీ కలెక్టర్ కమలకాంత పండా, సరస్వతీ శిశు విద్యామందిర్ ప్రధాన అచార్యులు సరోజ్ కుమార్ పండా, రాఘవ సాహు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ నగర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సరస్వతీ శిశు విద్యామందిర్‌లో రక్తదాన శిబిరం జరిగింది.
రాయగడలో..
రాయగడ: నేతాజీ శుభాష్ చంద్రబోస్ జయంతిని పురష్కరించుకుని స్థానిక ఆజాద్ హింద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాణిగుడఫారం వద్ద గల నేతాజీ విగ్రహానికి రాజ్యసభ మాజీ సభ్యులు నెక్కంటి పూల మాలలు వేసి శ్రధ్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్‌సీసీ కేడిట్‌లు పాల్గొన్నారు.
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో గురువారం సుబాష్ చంద్రబోస్ కూడలి వద్ద ఉన్న నేతాజీ విగ్రహానికి ఎస్పీ హెచ్.వినోద్ పటేల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జి.శ్రీనివాస్‌రావు, పి.కేశవరావు, చిన్నారావు, శంకర్ పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment