వైభవంగా స్కూల్ వార్షికోత్సవం
జయపురం: విద్యార్థులు గుణాత్మక విద్య అభ్యసించి ఉన్నతస్థాయికి ఎదగాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. జయపురం రింగ్‌రోడ్డు లొగల సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాల 4 వ వార్షికోత్సవంలో బుధవారం రాత్రి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.ముఖ్యవక్తగా అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియ ఉపాధ్యక్షుడు, ఒడిశా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి.శ్రీనివాస పట్నాయిక్ మాట్లాడుతూ విద్యార్థుల భవితను బంగారం చేయాలనే లక్ష్యంతో సెయింట్ జేవియర్స్ పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో నిర్వహించిన నృత్య, నాట్యాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
Comments
Please login to add a commentAdd a comment