‘జిల్లాల పరిధిలోనే ఉద్యోగాలు కల్పించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘జిల్లాల పరిధిలోనే ఉద్యోగాలు కల్పించాలి’

Published Tue, Oct 1 2024 1:00 AM | Last Updated on Tue, Oct 1 2024 1:00 AM

‘జిల్లాల పరిధిలోనే ఉద్యోగాలు కల్పించాలి’

జయపురం: జిల్లాల పరిధిలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నవరంగపూర్‌ జిల్లాలోని సర్పంచ్‌ల సంఘం, సంయుక్త కార్యాచరణ కమిటీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అక్టోబర్‌ 4వ తేదీన అవిభక్త కొరాపుట్‌ జిల్లా బంద్‌ జరపాలని కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. నవరంగపూర్‌ జిల్లా డాబుగాంలో ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆందోళన కార్యక్రమం ప్రకటించింది. అక్టోబర్‌ 1వ తేదీన ప్రతీ సమితి కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి, గణశిక్షా మంత్రుల దిష్టి బొమ్మలను దహనం చేయాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. 2వ తేదీన నవరంగపూర్‌ మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఽనిరాహార దీక్షలు నిర్వహించాలని, 4వ తేదీన అవిభక్త కొరాపుట్‌ బంద్‌ చేపట్టాలని సమావేశం పిలుపునిచ్చింది. అలాగనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే బాధ్యతను డాబుగాం బీజేడీ ఎమ్మెల్యే మనోహర రొంధారి, కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే భుజబల మఝిలకు అప్పగించాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొందారి, మాజీ ఎంపీ రమేష్‌ మఝి, జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు మోతీరామ్‌ నాయిక్‌, మాజీ ఎమ్మెల్యే భుజబల మఝి, కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠీ, ఒడిశా రాష్ట్ర ఆదివాసీ మహాసంఘ అధ్యక్షుడు అర్జున భొత్ర, జనజాతి సురక్షా మంచ్‌ ఉపాధ్యక్షుడు రతన్‌ మఝి, జిల్లా సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు జలందర మఝి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement