అలవాటే ప్రాణం తీసింది | - | Sakshi
Sakshi News home page

అలవాటే ప్రాణం తీసింది

Published Tue, Oct 1 2024 1:00 AM | Last Updated on Tue, Oct 1 2024 1:00 AM

-

పొందూరు: చుట్ట కాల్చే అలవాటు ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. లోలుగు గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన జడ్డు వరహాలమ్మ(93) తన అల్లుడు లోలుగు సూర్యనారాయణ ఇంటిలో ఉంటారు. భర్తతో పాటు ఒక్కగానొక్క కుమార్తె మరణించడంతో అల్లుడు సూర్యనారాయణ ఇంటిలోనే ఉంటున్నారు. వరహాలమ్మ ఎప్పటిలాగే చుట్ట కాల్చుతుండగా నోటిలో ఉ న్న చుట్ట చీరపై పడింది. ఫ్యాను గాలికి చుట్ట నుంచి మంటలు చెలరేగి దుస్తులకు అంటుకుంది. కుటుంబ సభ్యులు చూసి మంటలు ఆర్పేలోగా 90 శాతం శరీరం కాలిపోయింది. ఆస్పత్రికి తరలించేలోగా ఇంటి వద్దనే మృతి చెందింది. అల్లుడు సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. అనంతరం శవపంచనా మా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement