బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతల స్వీకరణ

Published Tue, Oct 1 2024 1:00 AM | Last Updated on Tue, Oct 1 2024 1:00 AM

బాధ్య

భువనేశ్వర్‌: భువనేశ్వర్‌ – కటక్‌ జంట నగరాల పోలీసు కమిషనర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి దేవ దత్త సింగ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌరవ కవాతుతో ఆయనను స్వాగతించారు. ఆయన 1998 బ్యాచ్‌ ఐపీఎ్‌స్‌ అధికారి. పలు హోదాల్లో లోగడ నిర్వహించిన బాధ్యతలపై కార్యదక్షత చాటుకున్నారు. 2024 సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని భారత రాష్ట్రపతి విశిష్ట సేవల పురస్కారం అందుకున్నారు. అలహాబాద్‌ విశ్వ విద్యాలయం నుంచి డిగ్రీ మరియు బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌, డాక్టరేట్‌ పూర్తి చేశారు.

బైక్‌ని ఢీకొన్న ట్రాక్టర్‌

భువనేశ్వర్‌: మయూర్‌భంజ్‌ జిల్లాలో బైక్‌ని ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మర ణం పాలయ్యారు. ఉదొలా పోలీసు ఠాణా కుట్లింగ్‌ బియ్యం మిల్లు కూడలి వద్ద సోమవా రం జరిగింది. కుట్లింగ్‌ గ్రామస్తులు భాదొ హేంబ్రమ్‌, రామేశ్వర్‌ హేంబ్రమ్‌ మృతి చెందా రు. కుట్లింగ్‌ గ్రామం నుంచి ఇటుకల లోడుతో దూసుకుపోతున్న ట్రాక్టర్‌ ఎదురుగా వస్తున్న బైక్‌ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసు కుంది. ఉదొలా ఠాణా పోలీసులు ఘటనా స్థలం సందర్శించి మృతదేహాల్ని పంచనామా కోసం సిఫారసు చేశారు.

గంజాయి స్వాధీనం

రాయగడ: ఒక పికప్‌ వ్యాన్‌లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను చంద్రపూర్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 3.75 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకు ని నిందితులను కోర్టుకు తరలించారు. చంద్రపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ వీరేంద్ర రాయ్‌ తెలిపిన వివరాల మేరకు.. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు చంద్రపూర్‌ సమీపంలోని కరమ ఘాటి వద్ద వాహన తనిఖీలను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ క్రమంలో గజపతి జిల్లా వడవ నుంచి మునిగుడ వైపు వస్తున్న ఒక పికప్‌ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేశారు. దీనిలో భాగంగా అందులో 11 బస్తాల గంజా యి పట్టుబడింది. దీంతో వడవ పోలీస్‌స్టేషన్‌ పరిధి బంధుగుడ గ్రామానికి చెందిన అరుణ్‌ బిసొయి, వ్యాన్‌ డ్రైవర్‌ మిధున్‌ బిసొయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

అక్రమంగా ఇసుకను

తరలిస్తున్న 7 ట్రాక్టర్లు సీజ్‌

ఆమదాలవలస : మండలంలోని నాగావళి నది పరివాహక ప్రాంతమైన దూసి గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ఏడు ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేసినట్లు స్థానిక ఎస్‌ఐ కె.వెంకటేష్‌ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు నదీ పరివాహక ప్రాంతం నుంచి పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్‌ చేశారు. అయితే కలెక్టర్‌ కార్యాలయం నుంచి, ఎస్పీ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆమదాలవలస పోలీసులు స్పందించి ఇసుక అక్రమ రవాణా వాహనాలు పట్టుకుంటున్నట్లు ఆమదాలవలస నియోజకవర్గ వాసులు చర్చించుకుంటున్నారు.

ఇసుక లారీల పట్టివేత

కొత్తూరు: మండలంలోని మెట్టూరు వద్ద మూడు, స్థానిక నాలుగు రోడ్ల కూడలి వద్ద రెండు ఇసుక లారీలను స్థానిక సీఐ చింతాడ ప్రసాదరావు పట్టుకున్నారు. ఇసుక లారీల డ్రైవర్ల వద్ద ఒడిశా రాష్ట్రం పెంగూడ ఇసుక ర్యాంపు రశీదులు ఉన్నట్లు సీఐ చెప్పారు. ఎక్కడ నుంచి ఇసుక లోడు చేశారన్నది నిర్ధారించాలని కొత్తూరు తహసీల్దార్‌ను కోరినట్లు చెప్పారు. ఇసుకను భామిని మండలంలో లోడ్‌ చేసినట్లు లారీ డ్రైవర్లు ఆర్‌ఐ, సీనియర్‌ అసిస్టెంట్లకు చెప్పినట్లు తహసీల్దార్‌ తెలిపారు.

సబ్జెక్టు కాంట్రాక్టు పోస్టులకు

ఇంటర్వ్యూల నిర్వహణ

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో సోమవారం సబ్జెక్టు కాంట్రా క్టు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సైన్స్‌, ఆర్ట్స్‌, ఇంజినీరింగ్‌ సబ్జెక్టులకు ఇంటర్వ్యూలు ఆయా కళాశాలల్లో నిర్వహించారు. పదుల సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు.

అనాథ బాలుడికి శస్త్ర చికిత్స

శ్రీకాకుళం కల్చరల్‌: నగరంలోని రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనురాగ నిలయంలో ఉంటున్న సోహిల్‌ (8) అనే అనాథ బాలుడికి ఏ–1 ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్‌ మూల వెంకటరావు శస్త్ర చికిత్స చేసి సోమవారం ప్రా ణాలు కాపాడారు. సోహిల్‌ ఆదివారం కడుపునొప్పి, వాంతులు కావడంతో ఏ–1 ఆస్పత్రి కి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి అత్యవసర శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని చెప్పారు. రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు కోరిన మేరకు ఉచితంగా అపెండిసైటిస్‌ శస్త్ర చికిత్సను నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బాధ్యతల స్వీకరణ 1
1/1

బాధ్యతల స్వీకరణ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement